

బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియలో షాలినితో పాటు అపూర్వ కూడా బయటకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వచ్చిన కామనర్స్ అపూర్వ, మిథిలేష్ మొదట్లో సందడి చేశారు. అయితే, ఎంట్రీ ఇచ్చిన రెండు రోజులకే రూ.15 లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ రావడంతో మిథిలేష్ హౌస్‌ను వీడగా, అపూర్వ మాత్రం తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, ఇతర కంటెస్టెంట్లతో తరచూ గొడవలు పడటంతో ఆమె వార్తల్లో నిలిచింది.
హౌస్‌లోకి వచ్చిన తొలి వారంలోనే కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ, అపూర్వ అరుపులు, వాదనలతో తోటి కంటెస్టెంట్లకు దూరమైనట్లు కనిపించింది. అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన రోహిత్, షాలిని, అమన్‌లు కూడా ఆమెకు దూరంగా ఉండగా, అపూర్వ ఎక్కువగా చరణ్‌తో కలిసి గేమ్ ఆడేందుకు ప్రయత్నించింది. మొదటి రోజు నుంచే త్రిగుణ్‌తో తరచూ వివాదాలకు దిగింది. ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న అపూర్వకు తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె ఎలిమినేట్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఓవర్ యాక్షన్, గొడవలే త్వరగా హౌస్ నుంచి బయటకు రావడానికి కారణమయ్యాయా అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే, ఎలిమినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!