

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ సందడి మొదలైంది. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. హోస్ట్ నాగార్జున్ తనదైన శైలిలో షోను మరింత ఆసక్తికరంగా మార్చారు. తాజాగా ‘గుండె నిండా గుడి గంటలు’ ఫేమ్ బాలు–మీనా జోడీతో రూపొందించిన ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విష్ణుకాంత్, అమూల్య గౌడ పోషించిన ఈ పాత్రలు ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి సందడి చేశాయి.
మీనా హౌస్‌లోని కిచెన్, హాల్, బెడ్‌రూమ్, అద్దాలు, స్విమ్మింగ్ పూల్ తదితర ప్రాంతాలను తన భవిష్యత్ ఇంటిలా ఊహించుకుంటూ హోమ్ టూర్ చేస్తుంది. బాలు మాత్రం తనదైన పంచ్‌లతో ఆమెకు కౌంటర్లు ఇస్తాడు. చివర్లో ఇది తమ ఇల్లు కాదని, బిగ్ బాస్ హౌస్ అని బాలు చెప్పడంతో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్, నామినేషన్లు, ఎలిమినేషన్లు, గొడవలే ఇక్కడ గేమ్ అని బాలు వివరించడంతో మీనా షాక్ అవుతుంది. చివరకు ఇద్దరూ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇది కేవలం బిగ్ బాస్ 10 ప్రమోషన్‌లో భాగమని స్పష్టమవుతుంది. అయితే అమూల్య గౌడకు గతంలో కన్నడ బిగ్ బాస్‌లో పాల్గొన్న అనుభవం ఉండటం, ఈ జోడీకి ఉన్న క్రేజ్‌తో భవిష్యత్తులో వీరు నిజంగానే హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా వస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!