

బిగ్‌బాస్ తెలుగు 10లో కెప్టెన్సీ పోటీ ముగియడంతో ఇప్పుడు ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వారం కృష్ణుడు, సృష్టి ఆటతీరుపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినీ వెనుకవైపు కూర్చోబెట్టి.. మీరు ఇద్దరూ కేవలం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండాలని పనిష్‌మెంట్ ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు.
ఇక సృష్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగా.. ఆట బాగా ఆడితే తానే కిస్ ఇస్తానంటూ నాగార్జున సరదాగా కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఈ ప్రోమోలో నాగార్జున ప్రత్యేక లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని గుర్తు చేసే లుక్‌లో ఆయన ఎంట్రీ ఇచ్చారు. తాజా ప్రోమోలో నాగార్జున హెచ్చరికలు, కంటెస్టెంట్లకు ఇచ్చిన పనిష్‌మెంట్‌తో పాటు ఎలిమినేషన్‌పై చర్చ నేపథ్యంలో నేటి ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!