

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం ముఖేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, శాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి మొత్తం తొమ్మిది మంది నామినేషన్లలో ఉన్నారు. మూడో వారంలో ముఖేష్ త్యాగం కారణంగా ఎలిమినేషన్ జరగకపోవడంతో.. నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెల్లడవుతున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ అత్యధిక ఓట్లతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 13.17 శాతం ఓట్లతో రోహిత్ రెండో స్థానంలో ఉండగా.. హౌస్‌లో తన ఆటతీరు, వ్యవహారశైలితో అభిమానులను సంపాదించుకుంటున్న ముఖేష్ మూడో స్థానానికి చేరుకున్నట్లు సమాచారం.
మరోవైపు చరణ్, సృష్టి ఓటింగ్ ట్రెండ్స్‌లో చివరి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారనే చర్చ సాగుతోంది. రెండో వారంలోనే సృష్టి ఎలిమినేట్ కావాల్సి ఉందనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆ వారం కృష్ణుడు బయటకు వెళ్లాడు. అనంతరం సుధీర్‌తో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినట్లు సమాచారం. ఇక మొదటి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో బయటకు వెళ్లిన చరణ్‌కు తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని అతడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాడనే చర్చ ఉంది. ఝాన్సీపై చరణ్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ప్రతికూల స్పందనకు కారణమైనట్లు తెలుస్తోంది. అయితే తుది ఎలిమినేషన్ అధికారిక ఓటింగ్ ఫలితాలు, ఎపిసోడ్‌లో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!