
జనరల్

బిగ్‌బాస్ తెలుగు 10 మరింత ఆసక్తికరంగా మారనుంది. ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు నేడు హౌస్‌లోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. శివ కుమార్, సాక్షి నాయుడు, దక్షి గుట్టికొండ, నీతూ నటరాజ్‌తో పాటు ‘అగ్నిపరీక్ష’ ఫేమ్ రామకృష్ణ పేర్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వీరిని హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హౌస్‌లో పలుమార్లు వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో కొత్త కంటెస్టెంట్ల రాకతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. కొత్తవారు ప్రస్తుత సభ్యులతో ఎలా కలిసిపోతారు, వారి ప్రవేశంతో పోటీ ఏ విధంగా మారుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎపిసోడ్‌లలో ఆట మరింత ఉత్కంఠభరితంగా సాగే అవకాశముంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!