

బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం ఓటింగ్‌లో ఆసక్తికరమైన లెక్కలు కనిపిస్తున్నాయి. మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండగా, అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం రోహిత్ 26 శాతంతో మొదటి స్థానంలో ఉన్నాడు. ముఖేష్ గౌడ 20 శాతం, త్రిగుణ్ 16 శాతంతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి ఓట్ షేర్ కలిపి దాదాపు 70 శాతంగా ఉండటం గమనార్హం. నరేష్ 9 శాతం, రాం ప్రసాద్ 8 శాతం, షాలిని 6 శాతం, అమన్ 5 శాతం, అపూర్వ 4 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు.
మరోవైపు టాస్కుల్లో చురుగ్గా కనిపిస్తున్న ఝాన్సీ, చరణ్ చెరో 3 శాతం ఓట్లతో చివరి స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో టాస్కుల్లో యాక్టివ్‌గా కనిపిస్తున్న ఝాన్సీకి తక్కువ ఓట్ షేర్ రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒకసారి ఎలిమినేట్ అయి వైల్డ్‌కార్డ్ ద్వారా తిరిగి హౌస్‌లోకి వచ్చిన చరణ్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇదే విధంగా ఉంది. అయితే ఇవి అధికారిక ఓట్లు కావు. ఓటింగ్‌కు ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో చివరి దశలో ట్రెండ్స్ మారే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!