

తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పటికే తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కానుంది. సామాన్యులను హౌస్‌లోకి తీసుకురావడానికి అగ్నిపరీక్ష సీజన్ 2ను నిర్వహిస్తున్నారు. ఈ షోకు నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, శ్రీముఖి యాంకర్‌గా కొనసాగుతోంది.బిగ్‌బాస్ తెలుగు 10కు నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
ఇక కొత్త సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ యాంకర్ చర్మిల నల్లూరి పేరు కూడా ఈ జాబితాలో చేరింది. ఇటీవల చెన్నై లవ్ స్టోరీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన చర్మిల తన యాంకరింగ్‌తో ఆకట్టుకుంది. ఆమె టాలెంట్‌ను మెచ్చిన అల్లు అరవింద్ స్టేజ్‌పైనే హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తానని చెప్పగా, తాను యాంకర్‌గా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు చర్మిల తెలిపింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!