

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమాలు, వ్యాపార వ్యవహారాలు, బ్రాండ్ ఒప్పందాలు, ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ కార్యకలాపాల వెనుక కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఆయన మేనేజర్ పూజా దద్లానీ. 2012లో షారుక్ పీఆర్ బృందంలో చేరిన ఆమె.. క్రమంగా ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన వ్యవహారాలన్నింటినీ సమన్వయం చేసే స్థాయికి ఎదిగారు. అంతకుముందు నటి దీపికా పదుకొణె మేనేజర్‌గా పనిచేసిన పూజ, ఆమె కెరీర్ ప్రారంభ దశలో కీలక పాత్ర పోషించారు. దీపికకు బాలీవుడ్‌లో అవకాశాలు రావడంలో తన వంతు కృషి చేసినట్లు అప్పట్లో ప్రశంసలు అందుకున్నారు.
షారుక్ సినిమా ప్రాజెక్టులు, నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ ప్రమోషన్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ వ్యవహారాలను పూజ సమర్థంగా నిర్వహిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆర్యన్ ఖాన్ అరెస్టు సమయంలోనూ కుటుంబానికి, న్యాయ బృందానికి మధ్య సమన్వయం చేసినట్లు సమాచారం. పూజ ఏడాదికి సుమారు రూ.9 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని, ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. 2026లో హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా రూపొందించిన ఎంటర్‌టైన్‌మెంట్ రంగ మహిళా శక్తిమంతుల జాబితాలోనూ ఆమెకు చోటు లభించినట్లు కథనాలు వెల్లడించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!