
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్ టోర్నీలో సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో టీమ్‌ఇండియా శ్రీలంకతో తలపడనుంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా సోమవారం భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌తో పాటు మరో క్వార్టర్‌ఫైనల్ కూడా రద్దైంది. మంగళవారం కూడా వర్షం కొనసాగడంతో నేపాల్-శ్రీలంక, బంగ్లాదేశ్-మలేసియా క్వార్టర్‌ఫైనల్స్ నిర్వహించడం సాధ్యపడలేదు.
దీంతో టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాల్లో ఉన్న శ్రీలంక (9), బంగ్లాదేశ్ (8) సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీఫైనల్లో భారత్, శ్రీలంక పోటీపడనున్నాయి. గత కొన్ని రోజులుగా నగోయాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరి సెమీఫైనల్ మ్యాచ్‌లకైనా వరుణుడి ఆటంకం తొలగుతుందో లేదో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!