

భారత్ అండర్-19 ఆసియా కప్ టైటిల్ సాధించడంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 361 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగులు చేసిన ఆర్యవీర్.. పాకిస్థాన్‌తో ఫైనల్‌లో మోచేతికి బలమైన దెబ్బ తగిలినా నొప్పిని భరిస్తూ 58 పరుగులు చేశాడు. భారత్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించిన అనంతరం తన అనుభవాలను పంచుకున్నాడు.
చివరి పది ఓవర్లలో భారీ లక్ష్యాలను ఎలా ఛేదించాలనే అంశంపై జట్టు సమావేశాల్లో చర్చించేవాళ్లమని ఆర్యవీర్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఎవరైనా ఒకరు చివరి వరకు క్రీజులో నిలవాలని భావించామని చెప్పాడు. ఆ బాధ్యతను లక్ష్య రాజేశ్ సమర్థంగా నిర్వర్తించాడని ప్రశంసించాడు. చివర్లో మోహిత్, మానల్ చౌహాన్ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్‌లో త్వరగా ఔటైనందున ఫైనల్‌లో పరుగులు చేయాలని పట్టుదలగా ఆడినట్లు వివరించాడు. మోచేతికి నొప్పి ఉన్నప్పటికీ క్రీజులో కొనసాగితే ప్రత్యర్థిపై ఒత్తిడి ఉంటుందని భావించానని, ప్రస్తుతం చేతికి ఎలాంటి నొప్పి లేదని వెల్లడించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!