
రాజకీయాలు

టీమిండియా జట్టులో మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై తెలంగాణ మంత్రి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా జట్టుకు అందుబాటులో లేని సమయంలో సిరాజ్ చూపించిన ప్రదర్శనలను ఆయన గుర్తుచేశారు. జట్టు అవసరమైన ప్రతిసారీ సిరాజ్ ముందుకొచ్చి దేశం కోసం అంకితభావంతో ఆడాడని, తన ప్రతిభతో పాటు పోరాట పటిమను కూడా నిరూపించుకున్నాడని ప్రశంసించారు.
మరోవైపు జట్టులో చోటు దక్కించుకున్న కాంబోజ్‌కు అజారుద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే సిరాజ్ ఎంపిక విషయంలో మరింత మెరుగైన పరిశీలన జరగాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని సిరాజ్‌కు తగిన స్పష్టతతో, గౌరవప్రదంగా వివరించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!