
జనరల్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో సిడ్నీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో వార్నర్‌ను కోర్టు దోషిగా నిర్ధారించి, 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ కేసులో న్యాయస్థానం విధించిన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇకపై వాహనం నడపాలంటే కారులో ఇంటర్‌లాక్ పరికరాన్ని తప్పనిసరిగా అమర్చుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ పరికరం ద్వారా డ్రైవర్ మద్యం సేవించిన స్థితిలో వాహనం స్టార్ట్ చేయకుండా నియంత్రించవచ్చు. క్రికెట్‌కు దూరమైన తర్వాత కూడా వార్తల్లో నిలుస్తున్న వార్నర్‌కు తాజా కోర్టు తీర్పు మరోసారి ఇబ్బందికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!