

ఫిఫా వరల్డ్ కప్‌లో కొలంబియా జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. కాంగో డీఆర్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించిన కొలంబియా, వరుసగా మూడోసారి నాకౌట్ దశకు చేరింది. మ్యాచ్ మొత్తం కొలంబియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, కాంగో డీఆర్ గోల్‌కీపర్ అద్భుత ప్రదర్శనతో చాలా సేపు గోల్‌ను అడ్డుకున్నాడు.
జేమ్స్ రోడ్రిగ్వెజ్, లూయిస్ డియాజ్, జాన్ ఆరియాస్ అనేక అవకాశాలు సృష్టించినా గోల్ సాధించలేకపోయారు. చివరకు 76వ నిమిషంలో జువాన్ క్వింటెరో ఇచ్చిన పాస్‌ను డేనియల్ మునోజ్ అందుకుని గోల్‌గా మలిచాడు. ఆ ఒక్క గోల్‌తో కొలంబియా కీలక విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ విజయంతో కొలంబియా రెండు మ్యాచ్‌లలో ఆరు పాయింట్లు సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. మరోవైపు ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్ 5-0 తేడాతో గెలిచి తదుపరి దశకు చేరింది. దీంతో గ్రూప్‌లో అగ్రస్థానం కోసం కొలంబియా, పోర్చుగల్ జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!