
జనరల్

ఫ్రాన్స్ నేషనల్ ఫుట్‌బాల్ టీమ్ ఫిఫా ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్ పోరులో మొరాకో నేషనల్ ఫుట్‌బాల్ టీమ్‌పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయానందాన్ని కెప్టెన్ కిలియన్ ఎంబాపె గాయం కాస్త మసకబార్చింది. మ్యాచ్ చివరి నిమిషాల్లో అతడు చీలమండ నొప్పితో మైదానం వీడటం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
మ్యాచ్ మధ్యలోనే చీలమండ నొప్పితో ఇబ్బంది పడ్డ ఎంబాపె, 77వ నిమిషంలో నొప్పి పెరగడంతో మైదానంలో పడిపోయాడు. దీంతో కోచ్ డిడియర్ డెషాంప్స్ అతని స్థానంలో జీన్-ఫిలిప్ మాటెటాను మైదానంలోకి దింపాడు. గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినా, మ్యాచ్ అనంతరం ఎంబాపె అభిమానులకు తాను బాగానే ఉన్నానని, పెద్ద సమస్య కాదని చెప్పడంతో సెమీస్ ముందు ఊరట కలిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!