
క్రీడలు

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. కకామిగహారాలో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 2-0తో ఓడించింది. తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కొరియా పటిష్ఠ రక్షణను భారత్ ఛేదించలేకపోయింది. 44వ నిమిషంలో ఇషికా చౌదరి కీలక గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది.
చివరి క్వార్టర్‌లో భారత్ మరింత దూకుడుగా ఆడింది. కెప్టెన్ సలీమా టెటే అద్భుతమైన రన్‌తో ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకెళ్లగా.. భారత్ రెండో గోల్ సాధించి ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. అనంతరం భారత రక్షణ శ్రేణి కొరియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయాన్ని ఖరారు చేసింది. దీంతో ఫైనల్లో చైనాతో తలపడనుంది. అక్టోబర్ 2న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ పసిడి కోసం పోరాడనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!