

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి రోజు ఆటలో తన పదునైన బంతులతో కివీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పదో స్థానానికి చేరుకున్నాడు. తొలి రోజు మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. 53 టెస్టుల్లో మొత్తం 237 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 236 వికెట్లు తీసిన మాజీ భారత పేసర్ జవగళ్ శ్రీనాథ్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో ప్రపంచ రికార్డును కొనసాగిస్తున్నాడు.
మరోవైపు వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఒకే మైదానంలో అత్యధిక సెంచరీలు సాధించిన న్యూజిలాండ్ బ్యాటర్ల జాబితాలో మార్టిన్ క్రో, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. వీరితో సమానంగా వెల్లింగ్టన్ మైదానంలో నికోల్స్ ఐదు సెంచరీలు నమోదు చేశాడు. ఈ వేదికపై 15 ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు ఐదు శతకాలతో పాటు నాలుగు అర్ధశతకాలు సాధించాడు. ఇక హామిల్టన్ మైదానంలో కేన్ విలియమ్సన్ ఏడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. రాస్ టేలర్ ఆరు శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!