

ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ గేట్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో బాల్ టాంపరింగ్ అంశంపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. శాండ్‌పేపర్ వినియోగం గురించి అప్పట్లో జట్టులోని అందరికీ తెలుసని డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నట్లు వార్తలు రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అప్పట్లో జరిపిన విచారణపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు శాండ్‌పేపర్‌కు బదులుగా బాటిల్ మూతలను ఉపయోగించి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించేవాళ్లమని వెల్లడించాడు.
ఈ వివాదంపై ఇక చర్చను ఆపాలని, ఇలాంటి పరిణామాలు క్రికెట్‌కు నష్టం కలిగిస్తాయని అక్తర్ అభిప్రాయపడ్డాడు. బంతి స్వభావాన్ని మార్చే ప్రయత్నాలు కొన్నిసార్లు జట్టు మొత్తానికి తెలిసే జరుగుతాయని, రివర్స్ స్వింగ్ సాధించేందుకు అలా చేయాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. ఖవాజా చెప్పిన విషయాలు సరైనవే అయినప్పటికీ, వాటిని వెల్లడించడానికి ఎంచుకున్న సమయం మరింత మెరుగ్గా ఉండాల్సిందని అన్నాడు. తన పాత సహచర ఆటగాళ్లతోనూ కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చాయని, అయితే వారిని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఇప్పుడు ఎలాంటి వివరాలూ వెల్లడించబోనని స్పష్టం చేశాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!