
రాజకీయాలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అత్యంత కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ జట్టుకు శుభారంభం అందిస్తూ తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షెఫాలి 26 బంతుల్లో 34 పరుగులు చేసి సోఫీ మోలినెక్స్ బౌలింగ్‌లో అవుటయ్యారు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది.
ఆ తర్వాత స్మృతి మంధాన 37 బంతుల్లో 38 పరుగులు చేసి జెమీమా రోడ్రిగ్స్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యారు. దీంతో భారత్‌కు కీలక దశలో రెండో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ 85/2తో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ భారత్‌కు సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పోరుగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!