

న్యూజిలాండ్-ఎ జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్‌కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ గాయం కారణంగా కివీస్-ఎతో జరిగే తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో పంత్ పక్కటెముకలకు గాయమైంది. ఫిట్‌నెస్ అనుమతులకు లోబడే అతడిని తొలుత తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసినప్పటికీ, గాయం తీవ్రత కారణంగా తాజాగా ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించలేదు.
పంత్ స్థానంలో వికెట్‌కీపర్, బ్యాటర్ కుమార్ కుశాగ్రకు భారత-ఎ జట్టులో చోటు కల్పించారు. అయితే, మూడో టెస్టు మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు ముందు సన్నాహకంగా ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్-ఎ, భారత-ఎ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!