

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. కేవలం 53 బంతుల్లోనే 28 సిక్సర్ల సాయంతో 204 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి అసాధారణ ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా సరదాగా స్పందించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ పేరును ప్రస్తావించడం విశేషం “. మంగళవారం జెన్సన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. మరుసటి రోజే వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లోని ఏఐ చిప్స్ మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు” అంటూ ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎక్స్‌లో చమత్కరించింది.
యూఏఈ ఏ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇండియా ఏ తరఫున బరిలోకి దిగిన వైభవ్ అద్భుతంగా రాణించి జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఆస్ట్రేలియా ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ పేరిట ఉన్న వేగవంతమైన లిస్ట్ ఏ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. అనంతరం తన దూకుడును కొనసాగిస్తూ 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. తద్వారా లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 53 బంతుల్లో 204 పరుగులు చేసిన అతడు 28 సిక్సర్లతో ఒకే ప్రొఫెషనల్ క్రికెట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా మరో రికార్డు సృష్టించాడు.
మరోవైపు, వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. అతడిని భారత క్రికెట్ భవిష్యత్తుగా అభివర్ణించాడు. వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడిన గంగూలీ.. వైభవ్ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడని, ఐపీఎల్‌తో పాటు భారత్ తరఫున కూడా వచ్చిన అవకాశాలను అద్భుతంగా ఉపయోగించుకున్నాడని కొనియాడాడు. అయితే, ఈ చిన్న వయసులోనే అతడిని ఇతర దిగ్గజ క్రికెటర్లతో పోల్చడం సరికాదని సూచించాడు. ప్రస్తుతం వైభవ్ వయసు 15–16 ఏళ్లు మాత్రమేనని గుర్తుచేస్తూ, అతడిపై అనవసరమైన ఒత్తిడి పెంచకుండా స్వేచ్ఛగా ఆడనివ్వాలని అభిమానులు, విశ్లేషకులకు గంగూలీ విజ్ఞప్తి చేశాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!