

2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన అనధికారిక షెడ్యూల్ వివరాలు వెలుగులోకి రావడంతో టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం టోర్నీ 2027 అక్టోబర్ 4న ప్రారంభమై నవంబర్ 21న ఫైనల్‌తో ముగిసే అవకాశముంది. టెస్టులు, టీ20లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు ఇది చివరి ఐసీసీ మెగా టోర్నీ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రాబోయే 17 నెలలు వారి కెరీర్లో అత్యంత కీలకంగా మారాయి.
ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఆడే వన్డే మ్యాచ్‌లు పరిమితంగానే ఉండటంతో ప్రతి మ్యాచ్ ఎంతో ముఖ్యంగా మారింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ ఫిట్నెస్తో పాటు నిలకడైన ప్రదర్శనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచకప్ సమయానికి రోహిత్ వయసు 41కు చేరువ కాగా, కోహ్లీ కూడా 40కు దగ్గరవుతాడు. యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఉండటంతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ యువతకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తమ సత్తా చాటాల్సి ఉంటుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!