

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభను బీసీసీఐ తొలిసారిగా గుర్తించింది విజయవాడలో జరిగిన క్వాడ్రాంగ్యులర్ సిరీస్ ద్వారానే అని మాజీ భారత క్రికెటర్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. 2024 అండర్-19 ప్రపంచకప్‌కు ముందు ఇండియా-బి తరఫున ఆడిన వైభవ్ ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడని చెప్పారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, జింబాబ్వే సిరీస్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడని కొనియాడారు.
ముఖ్యంగా మూడో టీ20లో క్లిష్టమైన పిచ్‌పై వైభవ్ చూపిన పరిణతి తనను ఎంతో ఆకట్టుకుందని లక్ష్మణ్ తెలిపారు. ప్రతి మ్యాచ్‌తో అనుభవం పెంచుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా ఆడటం నేర్చుకుంటున్నాడని చెప్పారు. అయితే ఆటతో పాటు ఫిట్‌నెస్‌పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. క్యాచ్ పట్టే ప్రయత్నంలో గాయపడినా మైదానం వీడేందుకు నిరాకరించిన వైభవ్ జట్టు కోసం ఎంతటి అంకితభావంతో ఆడుతున్నాడో దీనితో స్పష్టమవుతుందని లక్ష్మణ్ ప్రశంసించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!