Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..

Writer: Harika S 11:39 AM, 3 జులై, 2026
రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..

ఫిఫా వరల్డ్‌కప్ మధ్యలో రిటైర్మెంట్‌పై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోనని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో స్పష్టం చేశారు. క్రొయేషియాపై 2-1 తేడాతో విజయం సాధించిన అనంతరం మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తన పూర్తి దృష్టి టోర్నమెంట్‌పైనే ఉందని, పోర్చుగల్ ప్రయాణం ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తన సోదరి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. అలాగే క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిచ్‌పై ప్రశంసలు కురిపిస్తూ, అతను ఎప్పటికీ ఒక లెజెండ్ అని కొనియాడారు. రియల్ మాడ్రిడ్ తరఫున కలిసి ఆడిన రోజులను గుర్తు చేసుకుంటూ, అతనితో మళ్లీ మైదానాన్ని పంచుకోవడం ఎప్పుడూ ఆనందమేనని అన్నారు.

ఈ మ్యాచ్‌లో రోనాల్డో మరో చారిత్రాత్మక రికార్డు నెలకొల్పారు. 41 సంవత్సరాల 147 రోజుల వయసులో ఫిఫా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన అత్యంత వృద్ధ ఆటగాడిగా నిలిచారు. అలాగే తన కెరీర్‌లో ఆరో వరల్డ్‌కప్ ఆడుతున్న రోనాల్డోకు నాకౌట్ దశలో ఇదే తొలి గోల్ కావడం విశేషం. అద్భుత ప్రదర్శనకు గాను ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తొలుత ఇవాన్ పెరిసిచ్ గోల్‌తో క్రొయేషియా ఆధిక్యంలోకి వెళ్లగా, VAR సమీక్ష తర్వాత లభించిన పెనాల్టీని రోనాల్డో గోల్‌గా మలిచారు. చివర్లో గోన్సాలో రామోస్ చేసిన గోల్‌తో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్‌తో తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు

చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు

రొనాల్డోకు మరో రెండు రికార్డులు

రొనాల్డోకు మరో రెండు రికార్డులు

WT20 వరల్డ్ కప్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ ఘన విజయం

WT20 వరల్డ్ కప్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ ఘన విజయం

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

ట్యాగ్లు
క్రిస్టియానో రోనాల్డోపోర్చుగల్క్రొయేషియాఫిఫా వరల్డ్‌కప్లూకా మోడ్రిచ్ఫుట్‌బాల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
అభిమానికి బహుమతి...హార్దిక్ పాండ్య గొప్ప మనసు

అభిమానికి బహుమతి...హార్దిక్ పాండ్య గొప్ప మనసు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తక్షశిల పనులపై యునెస్కో ఆగ్రహం
జనరల్

తక్షశిల పనులపై యునెస్కో ఆగ్రహం

విజయవాడ: సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
జనరల్

విజయవాడ: సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

ఢిల్లీలో ఫుడ్ మాఫియా గుట్టురట్టు
జనరల్

ఢిల్లీలో ఫుడ్ మాఫియా గుట్టురట్టు

అమర్‌నాథ్ భక్తులకు మోదీ సందేశం
జనరల్

అమర్‌నాథ్ భక్తులకు మోదీ సందేశం

ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భూకంపం
జనరల్

ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భూకంపం

ట్రంప్‌కు నోబెల్ నామినేషన్… హంటర్ బైడెన్ వ్యంగ్యం
జనరల్

ట్రంప్‌కు నోబెల్ నామినేషన్… హంటర్ బైడెన్ వ్యంగ్యం

చైనాలో రూఫ్‌టాప్ మిస్టింగ్‌తో వేడి తగ్గింపు
జనరల్

చైనాలో రూఫ్‌టాప్ మిస్టింగ్‌తో వేడి తగ్గింపు

ఇరాన్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల భయం
జనరల్

ఇరాన్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల భయం

రావు బహదూర్‌ ఎలా ఉందంటే?
రివ్యూలు

రావు బహదూర్‌ ఎలా ఉందంటే?

తకాయిచిని ‘చెల్లి’గా పేర్కొన్న మోదీ
జనరల్

తకాయిచిని ‘చెల్లి’గా పేర్కొన్న మోదీ

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..
క్రీడలు

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..

కేటీఆర్‌కు జూపల్లి సవాల్
రాజకీయాలు

కేటీఆర్‌కు జూపల్లి సవాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!