

జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ సంజు శాంసన్‌కు విశ్రాంతి ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచి, ఐపీఎల్‌లోనూ అద్భుతంగా రాణించిన సంజు ఆ తర్వాత ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో విఫలమయ్యాడు. ఇదే సమయంలో అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం దక్కగా, ఐపీఎల్‌లో రాణించిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా జట్టులో చోటు సంపాదించాడు.
సంజును పక్కన పెట్టడంపై విమర్శలు రావడంతో బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. ఇది ఫామ్‌కు సంబంధించిన నిర్ణయం కాదని, ఆసియా క్రీడల జట్టులో ఇప్పటికే చోటు దక్కిన సంజుకు విశ్రాంతి ఇవ్వడమే లక్ష్యమని తెలిపారు. సీనియర్ ఆటగాడిని బెంచ్‌పై కూర్చోబెట్టేందుకు జింబాబ్వే పర్యటనకు తీసుకెళ్లడం సమంజసం కాదని వివరించారు.
ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి జట్టులోకి రాగా, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్‌లకు ఈ సిరీస్‌లో అవకాశం దక్కలేదు. జూలై 23, 25, 27 తేదీల్లో హరారే వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!