

ఫిఫా ప్రపంచకప్‌లో సెనెగల్ జట్టు చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్లో ఒకే మ్యాచ్‌లో ఐదు గోల్స్ చేసిన తొలి ఆఫ్రికన్ జట్టుగా నిలిచింది. గ్రూప్ ‘ఐ’లో భాగంగా టొరంటో వేదికగా జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సెనెగల్ ఇరాక్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన సెనెగల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే జట్లు టాప్ రెండు స్థానాలతో ముందుకు సాగగా, ఇరాక్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే సెనెగల్ ఆధిపత్యం చాటింది. నాలుగో నిమిషంలో హబీబ్ డియారా గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొంతసేపు రక్షణాత్మక ఆట సాగినా, 56వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఇస్మాలియా సర్ గోల్ చేసి ఆధిక్యాన్ని పెంచాడు. అనంతరం పేప్ గయే 59, 71వ నిమిషాల్లో వరుసగా గోల్స్ సాధించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. చివరగా 82వ నిమిషంలో ఇలిమన్ ఎన్డియాయే గోల్‌తో 5-0 స్కోరు పూర్తి చేసి సెనెగల్ ఘన విజయాన్ని నమోదు చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!