
జనరల్

కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికై వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారాడు. భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈరోజు బెల్ఫాస్ట్లో జరగనుండగా, అతని అరంగేట్రంపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. అయినప్పటికీ వైభవ్‌పై నెలకొన్న భారీ ఆసక్తితో మ్యాచ్ టికెట్లు క్షణాల్లోనే అమ్ముడైపోయాయి.
బెల్ఫాస్ట్ స్టేడియంలో సుమారు 5 నుంచి 6 వేల మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ, దానికి మూడింతల డిమాండ్ వచ్చినట్లు ఐర్లాండ్ క్రికెట్ కమిటీ ఛైర్మన్ బ్రియాన్ మాక్‌నీస్ తెలిపారు. వైభవ్ అరంగేట్రాన్ని ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో, తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న బెల్ఫాస్ట్కు బదులుగా డబ్లిన్‌లో మ్యాచ్ నిర్వహించి ఉంటే మరింత మంది అభిమానులకు అవకాశం లభించేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!