
క్రీడలు

17 ఏళ్ల భారత యువ షట్లర్ తన్వీ శర్మ తైపీ ఓపెన్ సూపర్ 300 మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని కెరీర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నాంకు చెందిన తు లిన్ ఎన్గ్యూయెన్ను 21-16, 21-16తో వరుస గేమ్‌లలో ఓడించి అద్భుత ప్రతిభను చాటుకుంది. కీలక సమయంలో ఆత్మవిశ్వాసంతో ఆడి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఈ విజయంతో తన్వీ భారత బ్యాడ్మింటన్‌లో మరో చారిత్రక మైలురాయిని అందుకుంది. 2008లో సైనా నెహ్వాల్ తర్వాత తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ షట్లర్‌గా నిలిచింది. అలాగే 17 సంవత్సరాల 222 రోజుల వయసులో టోర్నీ ఫైనల్‌కు చేరిన అతి పిన్న వయసు క్రీడాకారిణిగా రికార్డు సృష్టించి, కొరియా దిగ్గజం లీ యాంగ్ డే పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!