2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు

Writer: Shivani K 06:50 AM, 2 నవంబర్, 2026
రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎప్పటికీ భారత ప్రధానమంత్రి కాలేరని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాని కావాలనుకుంటే మాక్‌ పార్లమెంటులో మాత్రమే ఆ కల నెరవేరుతుందని ఎద్దేవా చేశారు. ఆదివారం చండీగఢ్‌లో రూ.258 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో షా ప్రసంగించారు. 1984లో సిక్కులపై జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూ.. దాని జ్ఞాపకాలు చెరిగిపోకముందే నవంబరు 1న రాహుల్‌ గాంధీ ‘చలో దిల్లీ’ పేరుతో కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం, అరాచకత్వాన్ని ప్రోత్సహించడం, పార్లమెంటు కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం విపక్షాల వైఖరిగా మారిందని ఆరోపించారు. తన కుమారుడిని ప్రధానిని చేయాలన్న సోనియా గాంధీ ఆశ నెరవేరకపోవడంతోనే కాంగ్రెస్‌ మాక్‌ పార్లమెంటు మార్గాన్ని ఎంచుకుందని షా వ్యాఖ్యానించారు.

దీపావళి ముగిసే వరకు ‘చలో దిల్లీ’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని దిల్లీ వ్యాపారులు చేసిన విజ్ఞప్తిని ఇండియా కూటమి నేతలు పట్టించుకోలేదని అమిత్‌ షా విమర్శించారు. ఈ పరిణామాల ప్రభావం రాబోయే ఎన్నికల్లో కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇండియా కూటమి నిర్వహించిన ‘చలో దిల్లీ’ ర్యాలీని కేంద్ర మంత్రి జె.పి. నడ్డా ‘మూర్ఖ నాటకం’గా అభివర్ణించారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ రాజ్యాంగబద్ధ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆరోపించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకత్వాన్ని తొలగించండి’ నినాదంతో భాజపా దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించింది. హరియాణాలోని రోహ్‌తక్‌లో జరిగిన ర్యాలీకి నబీన్‌ నేతృత్వం వహించారు. 1984 సిక్కు అల్లర్లపై కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమ దిల్లీలోని హరినగర్‌లోనూ భాజపా నిరసన ప్రదర్శన చేపట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

ట్యాగ్లు
అమిత్‌ షారాహుల్‌ గాంధీసోనియా గాంధీభాజపాకాంగ్రెస్‌చలో దిల్లీమాక్‌ పార్లమెంటునితిన్‌ నబీన్‌జె.పి. నడ్డా1984 సిక్కు అల్లర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు

ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ
జనరల్

ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన
జనరల్

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం
జనరల్

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌
రాజకీయాలు

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు
రాజకీయాలు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?
జనరల్

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌
సినిమాలు

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!