

దేశంలో పేదరిక నిర్మూలన అనేది తమ ప్రభుత్వానికి కేవలం నినాదం మాత్రమే కాదని, అదొక దృఢమైన నిబద్ధత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పేదరికం తగ్గుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ చిత్రం ‘దస్వీ’లోని స్ఫూర్తిదాయకమైన ‘థాన్‌లియా’ పాటను నేపథ్యంగా ఉపయోగిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో ఈ విషయాలను ప్రస్తావించారు. పేదరికం తగ్గింపులో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రపంచ బ్యాంకు గుర్తించడం గర్వకారణమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ‘గరీబీ హటావో’ నినాదంతో ప్రచారం చేసిందని, అయితే తమ ప్రభుత్వం పేదరిక నిర్మూలనను కార్యాచరణలో చూపిస్తోందని మోదీ విమర్శించారు. గత ఆరేళ్లలో 13.4 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. పేదరికాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!