

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించిన వెస్టిండీస్ సిరీస్‌ను 2–2తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత్ 19.4 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐదో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
భారత బ్యాటర్లలో సంజు శాంసన్ 56, తిలక్ వర్మ 43, నితీష్ కుమార్ రెడ్డి 41, అభిషేక్ శర్మ 29 పరుగులతో రాణించారు. అయితే శ్రేయస్ అయ్యర్ 16 పరుగులకే పరిమితం కాగా, ఇషాన్ కిషన్ 6 పరుగులు మాత్రమే చేశాడు. నమన్ ధీర్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా, అక్షర్ పటేల్ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయంతో అర్ష్‌దీప్ సింగ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం భారత్‌కు మరో ఎదురుదెబ్బగా మారింది.
వెస్టిండీస్ బౌలర్లలో కీమో పాల్ ఐదు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్‌లను ఔట్ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. గుడాకేశ్ మోటీ రెండు వికెట్లు తీయగా, షామర్ స్ప్రింగర్ ఒక వికెట్ సాధించాడు. సిరీస్ 2–2తో సమం కావడంతో నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!