

ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్‌కు చెందిన పలు ఆన్‌లైన్ సేవల్లో మంగళవారం రాత్రి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐక్లౌడ్, యాప్ స్టోర్, యాపిల్ పే, యాపిల్ సపోర్ట్ సహా పలు సేవలు పనిచేయడం లేదంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సేవల్లో అంతరాయాలను పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించింది. తొలుత అమెరికా, యూరప్ దేశాల్లో సమస్యలు మొదలై, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకూ విస్తరించినట్లు తెలిపింది.
ఈ అంతరాయం కారణంగా ఐఫోన్లు, మ్యాక్ కంప్యూటర్లలో ఐక్లౌడ్ ఖాతాల నుంచి వినియోగదారులు అకస్మాత్తుగా లాగౌట్ కావడం, తిరిగి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించినప్పుడు విఫలమవడం, ఎర్రర్ సందేశాలు కనిపించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. యాప్ స్టోర్ అందుబాటులో లేకపోవడంతో యాప్‌ల డౌన్‌లోడ్లు, అప్‌డేట్లు నిలిచిపోయాయి. యాపిల్ పే చెల్లింపులు, కొత్త పరికరాల యాక్టివేషన్, యాపిల్ మ్యూజిక్, యాప్ స్టోర్ కనెక్ట్ సేవలపైనా ప్రభావం పడింది. అంతరాయానికి సైబర్ దాడి కారణమా, సాంకేతిక సమస్యనా అనేది స్పష్టత రాలేదు. యాపిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!