

కృత్రిమ మేధ రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంథ్రోపిక్ సంస్థ భారీ ఐపీవోకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఐపీవో ద్వారా సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 5,300 మంది ఉద్యోగులున్న ఆంథ్రోపిక్‌లో సుమారు 4,250 మందికి ఐపీవో అనంతరం మిలియనీర్ హోదా దక్కవచ్చని అంచనా. వీరిలో దాదాపు 1,200 మంది ఆస్తుల విలువ 10 మిలియన్ డాలర్లు దాటవచ్చని, మరో 50 మంది సంపద 100 మిలియన్ డాలర్లకు మించవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. 1984 నాటి గోల్డ్ రష్ తర్వాత ఈ స్థాయిలో సంపద సృష్టి జరగడం ఇదే తొలిసారి అంటూ అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. మరోవైపు, ఆంథ్రోపిక్ ఉద్యోగులు అధిక సంఖ్యలో నివసిస్తున్న పాలో ఆల్టో సమీపంలోని అథెర్టన్ ప్రాంతం మరోసారి అమెరికాలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ సింగిల్ ఫ్యామిలీ ఇంటి సగటు ధర 10.73 మిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం.
ఆంథ్రోపిక్ ఐపీవో ద్వారా 81.3 బిలియన్ డాలర్లు సమీకరించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక్కో షేరును 83 డాలర్ల చొప్పున విక్రయిస్తూ మొత్తం 980 మిలియన్ షేర్లను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తొలుత 825 మిలియన్ షేర్లను విక్రయించాలని భావించినప్పటికీ, తర్వాత ఆ సంఖ్యను పెంచినట్లు సమాచారం. తాజా షేర్ ధర ఆధారంగా సంస్థ మార్కెట్ విలువ 1.4 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. అమెరికా మార్కెట్లలో ANT టిక్కర్ సింబల్‌తో షేర్లు ట్రేడింగ్ కానున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. గతేడాదితో పోలిస్తే సంస్థ ఆదాయం 1,200 శాతం పెరిగి 33.24 బిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం. ఇందులో క్లాడ్ కోడ్ కీలక ఆదాయ వనరుగా నిలిచింది. అయితే, ఇదే తొమ్మిది నెలల కాలంలో సంస్థ 104 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఆంథ్రోపిక్‌లో పెట్టుబడులు పెట్టగా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఏఎండీ సంస్థలు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కొత్తగా సంపన్నులుగా మారనున్న ఉద్యోగులకు ఆర్థిక సేవలు అందించేందుకు ప్రముఖ బ్యాంకులు పోటీపడుతున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!