

శుక్రవారం క్రిప్టో మార్కెట్‌లో పెద్దగా కదలిక కనిపించలేదు. బిట్‌కాయిన్ సుమారు $63,291 వద్ద, అంటే రూ.60.37 లక్షల దగ్గర ట్రేడైంది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ దాదాపు 0.83 శాతం నష్టపోయింది. ఎథీరియం $1,882 వద్ద, సుమారు రూ.1.79 లక్షల దగ్గర కొనసాగింది. బినాన్స్ కాయిన్, సోలానా, ఎక్స్‌ఆర్‌పీ, డోజ్‌కాయిన్ వంటి ప్రధాన ఆల్ట్‌కాయిన్లలోనూ పరిమిత కదలికే నమోదైంది.
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ.. బిట్‌కాయిన్ బలమైన రికవరీ సాధించలేకపోయింది. మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గడం, సంస్థాగత పెట్టుబడుల డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బిట్‌కాయిన్ $64,000-$66,000 స్థాయిని తిరిగి అధిగమించడం, అలాగే $62,000 స్థాయి వద్ద మద్దతును నిలబెట్టుకోవడం తదుపరి దిశను నిర్ణయించడంలో కీలకంగా మారనుంది. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!