

ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ సంస్థ ఎలోఎలో గ్రూప్ ‘డాల్ఫిన్ ఏఐ’ (Dolphin AI) పేరుతో కొత్త ఏజెంటిక్ ఏఐ వీడియో ప్రొడక్షన్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. స్క్రిప్టింగ్, షాట్ ప్లానింగ్ నుంచి వీడియో జనరేషన్, ఎడిటింగ్, ఎన్‌హాన్స్‌మెంట్ వరకు మొత్తం ప్రొడక్షన్ ప్రక్రియను ఒకే వర్క్‌ఫ్లోలో నిర్వహించేలా దీన్ని రూపొందించారు. ముంబైలో జరిగిన FICCI FRAMES 2026లో సెప్టెంబర్ 29న ఈ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేశారు. ఇప్పటికే ఎలోఎలోకు చెందిన Story TV ద్వారా 5,000కు పైగా ఒరిజినల్ డ్రామాలను రూపొందించిన అనుభవంతో పాటు, ప్రతి నెలా 1 లక్షకు పైగా క్రియేటివ్ ఆస్తులను పరీక్షిస్తున్న అనుభవం నుంచి డాల్ఫిన్ ఏఐను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది.
డాల్ఫిన్ ఏఐలోని మల్టీ-షాట్ ప్లానింగ్, కంటిన్యుటీ టెక్నాలజీ.. పలు షాట్లలో క్యారెక్టర్లు, వాయిస్‌లు, దుస్తులు, ప్రాప్స్, లొకేషన్లు, విజువల్ స్టైల్ ఒకే విధంగా ఉండేలా రూపొందించబడింది. ఇందులోని Film Studio ఫీచర్ స్క్రిప్ట్‌ను విశ్లేషించి క్యారెక్టర్లు, లొకేషన్లు, ప్రాప్స్‌ను గుర్తించి, దాన్ని మల్టీ-షాట్ ప్రొడక్షన్‌గా మార్చేలా పనిచేస్తుంది. Chat, Templates, Playground వంటి ఆప్షన్లతో పాటు MCP సపోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా ChatGPT, Claude, Gemini, Cursor వంటి అనుకూల ఏఐ క్లయింట్లతో డాల్ఫిన్ సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం డాల్ఫిన్ ఏఐ ఎర్లీ యాక్సెస్ కోసం వెయిట్‌లిస్ట్ లేదా ఇన్వైట్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!