
జనరల్

భారతదేశానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన నిర్మాణాలు, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక చిహ్నాలు, జాతీయ విజయాలకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ వేదికలపై భారతీయ ప్రత్యేకతను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
వందే భారత్ రైలు, యూపీఐ, చెనాబ్ బ్రిడ్జి, అటల్ టన్నెల్, బ్రహ్మోస్, రామ మందిరం, భారత్ మండపం వంటి భారతీయ ప్రతీకలను ఎమోజీలుగా రూపొందించే అంశం ఇందులో ఉంది. భారతీయ నిర్మాణాలు, సాంకేతికత, సంస్కృతి, విజయాలను ప్రపంచ డిజిటల్ ప్రేక్షకులకు చేరువ చేయడమే ఈ ఆలోచన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!