

భారత ప్రభుత్వ సూచనల మేరకు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పులు చేపట్టింది. అశ్లీల, హింసాత్మక, రెచ్చగొట్టే స్వభావం ఉన్న పోస్టులను ఇకపై యూజర్ల ఫీడ్‌లో తక్కువగా చూపించనుంది. ముఖ్యంగా యూజర్లు ఫాలో అవ్వని అకౌంట్ల నుంచి వచ్చే రీల్స్, ఎక్స్‌ప్లోర్ విభాగంలోని కంటెంట్‌పై ఈ మార్పుల ప్రభావం ఉండనుంది. అభ్యంతరకరమైన పోస్టుల సిఫార్సులను నియంత్రించి, వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని మెటా వెల్లడించింది.
కంటెంట్‌ను పరిశీలించేందుకు కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించనున్నట్లు సంస్థ తెలిపింది. యూజర్ల నుంచి అందుతున్న ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సేఫ్టీ సెట్టింగ్స్‌ను కూడా అప్‌డేట్ చేసింది. అక్టోబర్ 10న కేంద్ర ఐటీ శాఖ జారీ చేసిన సూచనల నేపథ్యంలో మెటా ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు చూసే రీల్స్, ఇతర సిఫార్సు కంటెంట్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!