

పిల్లల ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ కొత్త పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీనేజర్లు కొత్త గ్రూపుల్లో చేరినా, వాటి నుంచి బయటకు వచ్చినా తల్లిదండ్రులకు అలర్ట్ అందేలా ఫీచర్‌ను రూపొందించింది. దీంతో పాటు ప్రొఫైల్ ఫొటో, గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్‌లపై తల్లిదండ్రులకు మరింత నియంత్రణ లభించనుంది. పిల్లలు వాట్సాప్‌ను సురక్షితంగా ఉపయోగించేలా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.
మెటా ఏఐ వినియోగంపై కూడా టీనేజర్ల వయస్సుకు అనుగుణంగా పరిమితులు వర్తించనున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత చాట్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కొనసాగుతుందని వాట్సాప్ స్పష్టం చేసింది. తల్లిదండ్రులు తమ అవసరాన్ని బట్టి పేరెంటల్ కంట్రోల్స్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్‌ను ఉపయోగించే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ కొత్త భద్రతా ఫీచర్ల గురించి తెలుసుకోవడం ముఖ్యమని కంపెనీ పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!