

ఇంటి పార్టీల నుంచి వీకెండ్ ట్రిప్‌లు, క్యాంపింగ్, ఫామ్‌హౌస్ పార్టీల వరకు పోర్టబుల్ పార్టీ స్పీకర్ల వినియోగం పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌లను బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకునే వీలుండటంతో పాటు.. యూఎస్‌బీ, ఆక్స్, ఎఫ్‌ఎం రేడియో వంటి సదుపాయాలు కూడా అనేక మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. మైక్ కనెక్టివిటీతో పాటలు పాడటం, అనౌన్స్‌మెంట్లు చేయడం వంటి వాటికీ ఉపయోగించుకోవచ్చు. రీచార్జబుల్ బ్యాటరీలు ఉండటంతో విద్యుత్తు సదుపాయం లేని ప్రదేశాల్లోనూ కొన్ని గంటల పాటు వినియోగించవచ్చు.
ప్రత్యేకంగా డీజే లేదా అదనపు లైటింగ్ లేకుండానే పార్టీ వాతావరణాన్ని సృష్టించడం ఈ స్పీకర్లకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం. సాధారణ బ్లూటూత్ స్పీకర్లతో పోలిస్తే హెవీ బేస్, స్పష్టమైన శబ్దాన్ని అందించే మోడళ్లు మార్కెట్‌లో ఉన్నాయి. సంగీతానికి అనుగుణంగా రంగులు మార్చే ఎల్‌ఈడీ లైట్లు పార్టీవైబ్‌ను మరింత పెంచుతాయి. కొన్ని స్పీకర్లను వైర్‌లెస్‌గా రెండు లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లతో అనుసంధానించి మరింత బలమైన సౌండ్‌ను పొందవచ్చు. వాటర్‌ప్రూఫ్ నిర్మాణం, డ్యూరబుల్ డిజైన్, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు పూల్ పార్టీలు, క్యాంపింగ్, ఓపెన్‌ఎయిర్ ఈవెంట్లకు వీటిని అనుకూలంగా మారుస్తున్నాయి. వివిధ బ్రాండ్లు వేర్వేరు బడ్జెట్‌లలో మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో వినియోగదారులకు అనేక ఎంపికలు లభిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!