

ఒప్పో అనుబంధ సంస్థ రియల్‌మీ తన P4 సిరీస్‌లో భాగంగా కొత్త Realme P4R 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మిడ్‌రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో భారీ 8000mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందించారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది.
రియల్‌మీ P4R 5Gలో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7తో పనిచేసే ఈ డివైస్‌కు 2 ఏళ్ల OS అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. IP65 రేటింగ్, AI Pulse Light, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 27W రివర్స్ ఛార్జింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!