

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని Sonodyne రెండు కొత్త ఆడియో ఉత్పత్తులను తీసుకొచ్చింది. వాటిలో Sama 7000 సౌండ్‌బార్ కాగా, Malhar G2 మ్యూజిక్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన స్పీకర్. Sama 7000 5.1.2-ఛానల్ Dolby Atmos సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో ఎడమ, మధ్య, కుడి, సరౌండ్ ఛానళ్ల కోసం ఫుల్-రేంజ్ డ్రైవర్లతో పాటు ప్రత్యేక హైట్ ఛానళ్లు ఉన్నాయి. పై వైపు ఉన్న స్పీకర్లు ఇమ్మర్సివ్ ఆడియో అనుభూతిని అందిస్తాయి. 10-అంగుళాల హై-ఎక్స్‌కర్షన్ డ్రైవర్ ఉన్న వైర్‌లెస్ సబ్‌వూఫర్ సినిమాలు, మ్యూజిక్‌కు డీప్ బాస్‌ను అందిస్తుంది. HDMI eARC, 4K Dolby Vision passthrough, ఆప్టికల్, AUX, Bluetooth వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర రూ.74,999.
ఇక Malhar G2 ప్రత్యేకంగా మ్యూజిక్ ప్రియులను లక్ష్యంగా చేసుకుంది. రిజిడ్ వుడ్ క్యాబినెట్ దీనికి ప్రీమియం లుక్ ఇవ్వడంతో పాటు క్యాబినెట్ రెజొనెన్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పెద్ద లివింగ్ స్పేస్‌లోనూ రిచ్, పవర్‌ఫుల్, డీటెయిల్డ్ సౌండ్ అందించేలా దీనిని రూపొందించారు. HDMI ARC, ఆప్టికల్, USB, Bluetooth కనెక్టివిటీతో పాటు వాల్యూమ్, బాస్, ట్రెబుల్, సోర్స్‌లను నియంత్రించేందుకు రిమోట్ కూడా ఉంది. ముఖ్యంగా క్లాసికల్, అకౌస్టిక్ మ్యూజిక్ వినేవారికి దీని సౌండ్ సిగ్నేచర్ ఆకట్టుకునేలా ఉంటుంది. రూ.55,000 ధరతో అందుబాటులో ఉన్న Malhar G2, సినిమాల కంటే మ్యూజిక్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి అనువైన ఎంపికగా నిలుస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!