

స్పేస్‌ఎక్స్ ఏఐ కోడింగ్ రంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ కోడింగ్ స్టార్టప్ కర్సర్ను 60 బిలియన్ డాలర్ల విలువైన ఆల్-స్టాక్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. నియంత్రణ సంస్థల అనుమతులు లభిస్తే 2026 మూడో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కర్సర్ మాతృసంస్థ అయిన అనీస్ఫియర్తో కుదిరిన భాగస్వామ్య ఒప్పందానికి ఇది కొనసాగింపుగా భావిస్తున్నారు.
భారత సంతతికి చెందిన యువ పారిశ్రామికవేత్త అమన్ సాంగర్ 2022లో కర్సర్ ను స్థాపించారు. సహజ భాషా సూచనల ఆధారంగా కోడ్‌ను రూపొందించడం, సవరించడం, సమీక్షించడం వంటి సేవలను అందించే ఈ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం ఏఐ కోడింగ్ రంగంలో ప్రముఖ సంస్థలతో పోటీ పడుతోంది. ఈ కొనుగోలు ద్వారా స్పేస్‌ఎక్స్ అనుబంధ ఏఐ సంస్థ ఎక్స్ ఏఐ కు ఆధునిక కోడింగ్ సామర్థ్యాలు, విస్తృత కార్పొరేట్ వినియోగదారుల నెట్‌వర్క్, మరింత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలు లభించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే Cursorకు భారీ కంప్యూటింగ్ వనరులు అందడంతో అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!