

విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రకటించింది. ఇకపై అంతర్జాతీయ ప్రయాణాల కోసం డేటా ఈ-సిమ్ ప్లాన్లను నేరుగా వాట్సాప్ యాప్‌లోనే సెర్చ్ చేసి, కొనుగోలు చేసి, ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం రిలయన్స్ జియో, వెరిజోన్, స్మార్ట్ ఆక్సియాటా, స్మార్ట్ కమ్యూనికేషన్స్ వంటి టెలికాం సంస్థలు, ఈ-సిమ్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సేవల ద్వారా విదేశాలకు వెళ్లినప్పుడు స్థానిక సిమ్ కార్డు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తమ గమ్యస్థానానికి అనుగుణంగా ఈ-సిమ్ ప్లాన్లను ఎంచుకుని యాప్‌లోనే కొనుగోలు, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. విదేశాలకు చేరుకున్న తర్వాత కూడా తమ ప్రస్తుత వాట్సాప్ నంబర్‌తోనే యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. తద్వారా అంతర్జాతీయ రోమింగ్ ఛార్జీల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తొలుత ఎంపిక చేసిన దేశాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. అయితే ఏ దేశాల్లో ముందుగా అందుబాటులోకి వస్తుంది, ప్లాన్ల ధరలు ఎంత ఉంటాయి అనే వివరాలను ఇంకా ప్రకటించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!