

పండగల సీజన్‌లో వాహనాలకు పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచడంతోపాటు డీలర్ల వద్ద వాహనాల నిల్వలను పెంచుతున్నాయి. పండగల సీజన్‌కు ముందే మారుతి సుజుకీ ఇండియా వద్ద సుమారు 2.2 లక్షల పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయి. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పటికే రెండు కొత్త ఉత్పత్తి లైన్లను ప్రారంభించామని, దీంతో ఉత్పత్తి సామర్థ్యం ఐదు లక్షల యూనిట్లు పెరిగిందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.
హ్యుండయ్ ఇండియా తన డీలర్ నెట్‌వర్క్ అంతటా తగినంత వాహనాల నిల్వలను సిద్ధం చేసిందని సంస్థ ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. మరోవైపు, సరఫరాను మెరుగుపరచడంతోపాటు వాహనాల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా యుటిలిటీ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సామర్థ్యాన్ని నెలకు 68 వేల యూనిట్లకు పెంచింది. పండగల సమయంలో పెరిగే బుకింగ్‌లకు అనుగుణంగా వాహనాలు అందుబాటులో ఉండేలా కంపెనీలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!