
సినిమాలు

భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అమల్లోకి వస్తే అర్హత కలిగిన దిగుమతి కార్లపై సుంకాలు తగ్గే అవకాశం ఉండటంతో, భారత్‌లో తమ లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని ఫెరారీ అంచనా వేస్తోంది. ఈ ఒప్పందం 2027లో అమల్లోకి వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో, అది కార్యరూపం దాల్చకముందే కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఫెరారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2026 చివరి నాటికి అహ్మదాబాద్, చెన్నైలలో మరో రెండు కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది. ప్రస్తుతం దిల్లీ, ముంబయి, బెంగళూరులో ఉన్న తన విక్రయ కేంద్రాలకు అదనంగా ఈ షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌కు కార్ల సరఫరాను కూడా పెంచాలని సంస్థ భావిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!