

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు అవసరమైన తుది నియంత్రణ అనుమతుల కోసం వేచి చూస్తోంది. భారత ప్రభుత్వంతో చురుకైన చర్చలు కొనసాగుతున్నాయని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా డిజిటల్ అనుసంధానాన్ని పెంపొందించే లక్ష్యానికి అనుగుణంగా మంచి స్పందన లభిస్తున్నట్లు వెల్లడించింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు లైసెన్స్ పొందిన స్టార్‌లింక్ ఇప్పటికే అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి, స్పెక్ట్రమ్ కేటాయింపు సహా తుది ఆమోదాల కోసం ఎదురుచూస్తోంది.
ఇటీవల వెలువడిన అనుమతులు రద్దు అవుతున్నాయన్న వార్తలను కంపెనీ ఖండించింది. స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రెయర్ మాట్లాడుతూ, సంస్థ పారదర్శకంగా మరియు బాధ్యతాయుతంగా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఇరాన్ యుద్ధ సమయంలో స్టార్‌లింక్ టర్మినళ్ల వినియోగంపై వచ్చిన అనుమానాల కారణంగా ఆలస్యం జరుగుతోందన్న వార్తలు అసత్యమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!