

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై జాతీయ కంపెనీల చట్టం అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) రుణదాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వారంలోగా స్పందించాలని రుణదాతలను ఆదేశించింది. అలాగే, రుణదాతల సమాధానంపై సుభాష్ చంద్ర కూడా వారంలోగా తన రీజాయిండర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణను అక్టోబర్ 29, 30 తేదీలకు వాయిదా వేసింది.
సుభాష్ చంద్ర వ్యక్తిగత హామీలకు సంబంధించిన దివాలా పరిష్కార ప్రక్రియలో రుణదాతల క్లెయిమ్‌లు సుమారు రూ.22,006.57 కోట్లుగా ఉండగా, సుమారు రూ.6.5 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళిక ప్రతిపాదించారు. అయితే ఈ ప్రణాళికను ఆమోదించిన గత ఉత్తర్వుల అమలును ఎన్‌సీఎల్‌టీ నిలిపివేసి, సుభాష్ చంద్ర తన ఆస్తులను విక్రయించడం లేదా బదిలీ చేయడంపై ఆంక్షలు విధించింది. ఈ పరిష్కార ప్రణాళికను రుణదాతలు కూడా ఎన్‌సీఎల్‌ఏటీలో సవాల్ చేయగా, ఆ పిటిషన్‌ను సుభాష్ చంద్ర అప్పీల్‌తో కలిపి విచారించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!