

ప్రతి నెలా ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా చెల్లిస్తున్నప్పటికీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా తగ్గిపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్యాంకింగ్ నిపుణుల ప్రకారం, సమయానికి చెల్లింపులు చేయడం క్రెడిట్ స్కోర్‌లో సుమారు 35 శాతం మాత్రమే ప్రభావం చూపుతుంది. మిగిలిన 65 శాతం ఇతర ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మొత్తం క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ వినియోగించడం, పాత క్రెడిట్ కార్డులను మూసివేయడం, తక్కువ సమయంలో అనేక రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం వంటి అంశాలు సిబిల్ స్కోర్‌ను తగ్గించే అవకాశముంది. ఇవి అధిక రుణ అవసరం లేదా ఆర్థిక ఒత్తిడి ఉన్నట్లు క్రెడిట్ బ్యూరోలు పరిగణించే అవకాశం ఉంటుంది.
అదే విధంగా, మీరు గ్యారెంటర్‌గా లేదా కో-అప్లికెంట్‌గా ఉన్న రుణంలో చెల్లింపులు ఆలస్యమైనా, ఆ ప్రభావం మీ సిబిల్ స్కోర్‌పైనా పడుతుంది. అలాగే సిబిల్ రిపోర్టులో సాంకేతిక లోపాలు, తప్పుగా నమోదైన రుణాలు లేదా చెల్లింపుల వివరాలు కూడా స్కోర్‌ను దెబ్బతీయవచ్చు. అందువల్ల క్రెడిట్ రిపోర్టును తరచూ పరిశీలించి, తప్పులు ఉంటే వెంటనే సరిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!