

బాలీవుడ్ నటులు పరిణీతి చోప్రా, జెన్నిఫర్ వింగెట్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘షక్: ట్రస్ట్ నో వన్’ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ఆదరణ పొందుతోంది. రెన్సిల్ డిసిల్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 24న విడుదలై ఓటీటీలో ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేకర్స్ ముంబైలో గ్రాండ్‌గా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పరిణీతి, జెన్నిఫర్ హాజరై సందడి చేశారు. అయితే, పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. కేక్ కట్ చేసే సమయంలో పరిణీతి పక్కన జెన్నిఫర్‌కు చోటు ఇవ్వలేదంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వీడియో ఆధారంగా పరిణీతిని కొందరు ట్రోల్ చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహారంపై జెన్నిఫర్ వింగెట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించింది. ఎవరి మీదా అనవసరమైన నెగిటివిటీ పెంచుకోవద్దని కోరుతూ, అక్కడ తగినంత స్థలం లేకపోవడం వల్లే తాను వెనక్కి తగ్గానని స్పష్టం చేసింది. పరిణీతి తనతో ఎప్పుడూ ప్రేమగా, ఆప్యాయంగా ఉంటుందని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. ఒకరిని కిందకు లాగకుండా అందరం కలిసి ఎదగాలని, చిన్న విషయాలను అనవసరంగా పెద్దవి చేయవద్దని సూచించింది. మరోవైపు, పరిణీతి కూడా ఈ ట్రోల్స్‌పై స్పందిస్తూ, గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఫన్నీ వీడియోలను చూసి తామిద్దరం బాగా నవ్వుకున్నామని చెప్పింది. వ్యూస్ కోసం కొందరు స్వయంప్రకటిత జర్నలిస్టులు ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారంటూ సెటైర్ వేసింది. జెన్నిఫర్ తనకు ఎప్పుడూ ఇష్టమైన వ్యక్తి అని పేర్కొంటూ, సిరీస్‌లో ఆమె నటనను పరిణీతి ప్రశంసించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!