
షోస్

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షాక్ తగిలింది. కంపెనీ తన ఏ-సిరీస్, ఎఫ్-సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచింది. నేటి నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వచ్చింది. మొత్తం 22 వేరియంట్లపై 3.13 శాతం నుంచి 9.52 శాతం వరకు ధరలు పెరిగినట్లు సమాచారం.
ఈ పెంపుతో మోడల్‌ను బట్టి ఒక్కో ఫోన్‌పై రూ.2,000 నుంచి రూ.4,000 వరకు అదనపు భారం పడనుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు తాజా ధరల పెంపును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏయే మోడళ్లపై ఎంత మేర ధరలు పెరిగాయనే పూర్తి వివరాలు అందుబాటులో లేవు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!