
జనరల్

అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 పోస్టర్‌ను శాప్ చైర్మన్ ఎ. రవినాయుడు ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. అండర్-17, అండర్-23 విభాగాల్లో బాస్కెట్‌బాల్, హాకీ, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, కబడ్డీ సహా మొత్తం 12 క్రీడాంశాల్లో నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో విజేతలకు మొత్తం రూ.94 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులతో పాటు ఈసారి విశ్వవిద్యాలయ క్రీడాకారులకు కూడా అవకాశం కల్పించడం విశేషమన్నారు. కార్యక్రమంలో శాప్ వైస్ చైర్మన్, ఎండీ ఎన్. భరణి, సభ్యురాలు రజని, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!